Friday, 25 September 2026 05:21:12 PM

అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం...

పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించాలి... ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

Date : 21 April 2025 05:18 PM Views : 401

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అకాల వర్షంతో నష్టపోయిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. అలాగే మంగనూరు గ్రామ శివారులో అకాల వర్షంతో నేలకొరిగిన పంటలను ఆయన పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. దీంతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని దళారుల మాటలను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ను ఇచ్చి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :