Saturday, 18 April 2026 10:11:14 AM

హైకమాండ్ ఏ బాధ్యతనైనా అప్పగిస్తే, నిబద్ధతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా...

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు – మంత్రి పదవిపై క్లారిటీ

Date : 02 August 2025 04:10 PM Views : 416

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి గురించి తాను ఎప్పుడూ అధిష్ఠానాన్ని అడగలేదని స్పష్టం చేశారు. "నాకు మంత్రి పదవి వద్దని అధిష్ఠానానికి చెప్పిన సంగతి లేదు. హైకమాండ్ ఏ బాధ్యతనైనా అప్పగిస్తే, నిబద్ధతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాను," అని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీలో ఎవరికైనా ఏ బాధ్యత ఇవ్వాలన్నదీ పూర్తి గా అధిష్ఠాన నిర్ణయించాల్సిన విషయమని, తాను ఆ నిర్ణయాలను గౌరవిస్తానని వ్యాఖ్యానించారు.ప్రముఖ రైతు సమస్యలపైనా ఆయన స్పందించారు. “రైతు అంటే మా కోసం ఓ రాజువంటివారు. పీఎం మోదీ లక్ష్యమంతా రైతులను రాజులుగా చేయడమే. గత పదకొండు సంవత్సరాల్లో రైతుల సంక్షేమానికి రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఇది మా ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం," అని చెప్పారు.విద్యార్థుల ప్రోత్సాహానికి సంబంధించిన ఓ అభిప్రాయాన్ని కూడా ఆయన పంచుకున్నారు. “టెన్త్‌ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీలు ఇప్పించేందుకు కేంద్రం స్థాయిలో చర్చలు జరుపుతాం. యువత భవిష్యత్తు కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం,” అని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గంలోని నాయకులతో సమావేశమై పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :