ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించింది. అయితే విచారణకు హాజరైయ్యేందుకు వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు ఏసీబీ కార్యాలయం ప్రధాన గెట్ వద్ద నిలిపివేసి ఒక్కరే లోపలి వెళ్లాలని తెలిపారు. దీనికి కేటీఆర్ అంగీకరించక పోవడంతో పాటు తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసారు.ఈ విచారణకు లాయర్లతో హాజరయ్యేందుకు అనుమతించాలని కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరుపున వేసిన పిటిషన్ కు హైకోర్టు అనుమతినిచ్చింది.మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.
Admin
Aakanksha News