Friday, 11 July 2025 04:59:16 AM

గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

Date : 19 October 2023 06:15 PM Views : 231

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిఎద్దేవా చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి నిన్న రాహుల్ గాంధీచేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాహుల్‌కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతనే అని పేర్కొన్నారు. కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం అన్నారు.సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. మోదీ దయా దాక్షిణ్యల మీద బతుకుంది గాంధీ కుటుంబం అన్నారు. బోఫోర్స్ కేసులో పీకలలోతు కూరుకు పోయిన చరిత్ర గాంధీ కుటుంబానిదని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఐదుగంటల కరెంట్, రైతులు పండించిన ధాన్యం కూడా కొనలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఫైర్‌ అయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :