Friday, 11 July 2025 04:44:04 AM

తాను ఎమ్మెల్సీ అడగటం లేదు..అడగను..

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత జగ్గారెడ్డి

Date : 07 March 2025 06:14 AM Views : 242

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తాను ఎమ్మెల్సీ అడగటం లేదని, తాను అడగనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందని, పోటీ చేసినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయాయని, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పదవి కావాలని పదేపదే అడిగే గుణం తనది కాదని ఆయన తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో మీడియా మిత్రులు ఎవరూ కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయొద్దని ఆయన సూచించారు.2017 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, ఆరు నెలల నుంచి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌కు చెప్పాలని అనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ సభ ఏర్పాట్లు చేశానో రాహుల్‌కు స్వయంగా చెప్పాలని ఢిల్లీకి వెళుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరికితే ఆయనతో మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :