Monday, 10 August 2026 05:02:03 PM

చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులను ఎత్తివేయాలి...

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ పోస్టులలో సింగరేణి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి....సామాజిక సేవకులు కర్నే బాబురావు

Date : 08 October 2024 05:54 PM Views : 465

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే ఎత్తివేయాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కు సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి పత్రం అందజేశారు. అలాగే సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ పోస్టులలో సింగరేణి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాబురావు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :