Sunday, 27 September 2026 01:34:49 AM

కాంట్రాక్టు ఔట్సోర్సింగ్, క్యాజువల్, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలి...

ఐ ఎఫ్ టీ యూ జిల్లా అధ్యక్షులు ఈ.నరేష్

Date : 22 August 2023 05:18 PM Views : 506

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 21 నుండి 27 వరకు జరిగే ప్రచార ఆందోళన కార్యక్రమాల భాగంగా గోదావరిఖని ఐఎఫ్ టీ యూ కార్యాలయంలో రాష్ట్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఈ.నరేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కార్మిక వర్గం క్రియాశీలకంగా పాల్గొందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కానీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కానీ కార్మిక వర్గానికి రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని కార్మికుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఉద్యోగ భద్రత ఇతర సౌకర్యాలు స్వరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశించారని అన్నారు. కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 68 అసంఘటిత రంగాల వారికి కనీస వేతన జీవోలు 2016 తర్వాత నేటికీ సవరించలేదన్నారు.కరోనా సమయంలో ఆ తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు 50% నుండి 100% పెరిగాయని అన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న కార్మికులకు వేతనాలు పెరగడం లేదని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల సీఈవోగా పనిచేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను కారు చౌకగా అమ్మి వేస్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలు ఆస్తుల వారి సంపదలను పెంచుకుంటూ కార్మికుల రక్త తరపణతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికుల మెడకు ఉరి తాడు బిగించారని అన్నారు.ఎన్నోఏళ్ల నండీ ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ క్యాజువల్ స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని 68 అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు సవరించాలని సింగరేణి ఎన్టీపీసీ, కేజీబీవీ మోడల్, యు ఆర్ ఎస్ , మైనారిటీస్ సంస్థల కార్మికులను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం జరిగే ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాలలో ఈనెల 29న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాలలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని నరేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం దుర్గయ్య ,తిప్పని రాంకీ, మర్రి శ్రావన్,శివ కుమార్, పయ్యావుల శ్రీకాంత్,కే మల్లేశం, రఫిక్ , శ్రీనివాస్ సంతోష్ , వెంకన్న, జనగామ రాజన్న. తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :