Monday, 10 August 2026 12:58:42 PM

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ ప్రకటన సిగ్గుచేటు..

వెంటనే బీసి లకు క్షమాపణ చెప్పాలి...బీసీ ప్రతినిధుల సమావేశం డిమాండ్

Date : 23 December 2023 08:16 PM Views : 430

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కులగణన చేపడితే సమాజ విభజన జరుగుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ,ప్రకటించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, అధ్యక్షతన కాచిగూడలో నిర్వహించిన బీసీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి తక్షణమే 70 కోట్ల మంది బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్‌లను వెంటనే అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాల వారీగా జనాభా లెక్కలు తీసి సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం వరకు పెంచాలని అలాగే విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశం లో నీలం వెంకటేశ్‌, మధుసూదన్‌, సుదాకర్ , బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :