Sunday, 27 September 2026 12:20:24 AM

జిడికే 2ఏ గని లోకి దిగిన గుర్తింపు సంఘం నాయకులు...

రక్షణ తో కూడిన బొగ్గు ఉత్పత్తి ని తీయాలి. రక్షణ చర్యలు లేకనే ప్రమాదం జరిగింది.

Date : 27 January 2024 01:16 PM Views : 501

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జిడికే 2ఏ ఇంక్లయిన్ లో ఇటీవల జరిగిన గని ప్రమాదం స్థలాన్నిగుర్తింపు సంఘం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు గని ప్రమాదా స్థలాన్ని పరిశీలించి సరైన రక్షణ చర్యలు చేపట్టక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా యాజమాన్యం సరైన రక్షణ చేపట్టాలని వారన్నారు. అదే విధంగా గాయపడ్డ సమ్మిరెడ్డి ని శుక్రవారం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్ తో పాటు గుర్తింపు సంఘం నాయకులు శుక్రవారం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న సమ్మిరెడ్డి ని కలిసి పరామర్శించడం జరిగిందని వారు పేర్కొన్నారు, మెరుగైన వైద్యం కోసం కామినేని హాస్పిటల్ నుండి యశోద హాస్పిటల్ కు యాజమాన్యం తో మాట్లాడి రెపర్ చేయించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాశ్, ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, కే.వీరభద్రం, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, గని పిట్ సెక్రటరీ నాగేందర్, వర్కమెన్ ఇన్స్పెక్టర్ రవి, సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, నాయకులు బుర్ర తిరుపతి,అప్రోజ్ ఖాన్, పుల్లూరి రాంచందర్ లు దిగగా, 2.ఇంక్లయిన్ పిట్ సెక్రటరీ పర్లపెల్లి రామస్వామి, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :