Monday, 10 August 2026 06:37:37 PM

ఏక్ పోలీస్... నినాదంతో పోలీస్ కుటుంబాల పిల్లలు...

న్యాయం కావాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ పిల్లల నినాదాలు....

Date : 29 October 2024 11:25 AM Views : 516

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : తెలంగాణలో రోజురోజుకు మారిపోతున్న పరిస్థితులతో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న మొన్నటి వరకు టీజీఎస్పీ (TGSP) పోలీస్ కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే... అయితే నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారులు పదిమంది బెటాలియన్ కానిస్టేబుల్స్ ను డిస్మిస్ చేశారు. 39 మందిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరికి మద్దతుగా నల్గొండ జిల్లా అన్నేపర్తి 12వ బెటాలియన్ ముందు బెటాలియన్ కానిస్టేబుల్స్ కు సంబంధించిన పిల్లల సైతం రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఏక్ పోలీసు అంటూ బెటాలియన్ కానిస్టేబుల్స్ పిల్లలు నినాదాలు చేశారు. రోజురోజుకు వారి సమస్య మొదలుతూ ఉండడంతో ఎటువైపు దారితీస్తుందో అనే సందేహాలు అధికార వర్గంలోనూ చర్చని అంశంగా మారుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :