Friday, 25 September 2026 04:57:07 PM

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 15 August 2023 05:51 PM Views : 821

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరిఖని శాంతినగర్, ఆర్ ఎఫ్ సి ఎల్ లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలురలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మీర్జా సిరాజ్ బేగ్ హాజరై స్వాతంత్ర దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కళాశాలలో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు, సిబ్బంది తో కలసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కళాశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. అలాగే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీలు, లిటరరీ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడంతో పాటు మెడల్స్ ను బహుకరించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజీ ఇస్మాయిల్ అహ్మద్ TMREIS కౌన్సిలర్, NRI సోషల్ యాక్టివిస్ట్ సైపోద్దిన్, జమాతే ఇస్లామీ హింద్ గోదావరిఖని జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ముస్తఫా, కమ్యూనిటీ లీడర్స్ మొహమ్మద్ అమీనుద్దీన్, మొహమ్మద్ సత్తార్, విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్ అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :