ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహా నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 11సార్లు గ్యాస్ ధరలను పెంచిందని రూ.460 ఉన్న గ్యాస్ ధర రూ.1100 వందలకు చేరిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఆదాయానికి మించి ధరలను పెంచుతుందని విమర్శించారు.ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
Aakanksha News