Saturday, 18 January 2025 08:53:43 AM

ఐకేపీ సెంటర్లకు కొబ్బరికాయలు కొడితే సరిపోతుందా?

రైతుల బతుకు గాల్లో దీపంలా తయారైంది..రేవంత్‌ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్‌

Date : 03 November 2024 04:59 PM Views : 904

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / సిద్దిపేట జిల్లా : ఐకేపీ సెంటర్లకు కొబ్బరికాయలు కొడితే సరిపోతుందా?...తడిసిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రేవంత్‌ సర్కారుపై మండిపడ్డారు.బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులను ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో వరిసాగైందని తెలిపారు. 9లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండాయని పేర్కొన్నారు. అధికారులు మాత్రం 800 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. పండిన పంటలో ఒకటో వంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేని పరిస్థితి దుస్థితి నెలకొందని తెలిపారు. గత నెల రోజులుగా వడ్లు తెచ్చినా కోనేటోళ్లు లేరని కనీసం రైతులను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని రైతులు హరీష్ రావుతో తమ గోడును వెల్లబోసుకున్నారు.లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్‌ సర్కారుపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. కరోనా కష్టకాలంలో కేసీఆర్‌ రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేశారని.. కేసీఆర్‌ 11 సార్లు 72,815 కోట్ల రైతుబంధు ఇచ్చారన్నారు. ఐకేపీ సెంటర్లకు వచ్చిన కొంత మంది మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి పోయారని.. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యటించాలన్నారు. రేవంత్‌ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని విమర్శించారు.ఇప్పటికైనా రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు