ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నిదర్శనం TSPSC పేపర్ లీకేజీ సంఘటన అని బిజెపి నాయకులు సోమారపు అరుణ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఆశలతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఆశలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నీరుగార్చారని ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తప్పు చేస్తే నా కుటుంబ సభ్యుల నైనా ఉపేక్షించానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా TSPSC పేపర్ లీక్ కావడానికి ముఖ్య కారణం ఐటి రంగమే అని దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాలని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కోచింగ్ ల పేరుతో లక్షల రూపాయలు నష్టపోయిన నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News