Saturday, 26 September 2026 07:23:46 AM

రైతులు తప్పక ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలి...

Date : 10 February 2023 10:25 PM Views : 590

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : భూములు ఇండ్లు కోల్పోతున్న రైతులు బాధితులు ప్రభుత్వము ఉత్తర్వుల మేరకు నష్టపరిహారాన్ని పొందేందుకు ముందుకు వచ్చి అధికారులకు సహకరించాలని నిర్లక్ష్యం చేస్తే, డబ్బులను ప్రభుత్వము,కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుందని, హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి హరి సింగ్ రైతులకు సూచించారు. శుక్రవారం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు శివారులో గల 91 ,96 సర్వే నంబర్లు గల భూములను ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో హరి సింగ్ మాట్లాడారు. ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి విస్తరణలో భూములు ఇండ్లు కోల్పోతున్న రైతులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తప్పకుండా నష్టపరిహారాన్ని పొందాలని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వము, అట్టి డబ్బులను కోర్టులో జమ చేసి జాతీయ రహదారి విస్తరణ పనులను నిర్వహిస్తుందని, ఎలాంటి ఇబ్బందులు అభ్యంతరాలు ఉన్న లిఖితపూర్వకముగా తమ వద్ద ఉన్న ఆధారాలతో, జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, తాసిల్దారులకు సమర్పించి నష్టపరిహారాన్ని మరింత పొందే అందుకు అధికారుల ఆదేశాలను సూచనలు పాటించాలని, కొంతమంది భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని పొందడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికైనా భూములు ఇండ్లు కోల్పోతున్న బాధిత రైతులు యజమానులు తమ వద్ద ఉన్న ఆధారాలతో తాసిల్దార్ ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, శాఖ పరంగా బాధితులకు తగిన సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు గ్రామ సర్పంచ్ మొకిరాల కిషన్ రావు, తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు, కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ సాగి మలహల్ రావు, మండల సర్వేయర్ ఫణి సంతోష్ కుమార్, రైతులు , యజమానులు, తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :