Wednesday, 23 September 2026 11:22:47 AM

ప్రపంచమే మన ప్రధాని మోదీని బాస్ గా గుర్తించింది..

విజయసంకల్ప సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Date : 08 July 2023 01:29 PM Views : 647

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన విజయసంకల్ప సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటూ బండి సంజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచమే మన ప్రధాని మోదీని బాస్ గా గుర్తించి సెల్యూట్ చేస్తుందన్న బండి సంజయ్..కొందరు ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే ఎందుకని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జై మోదీ నినాదాలు చేసినప్పుడు సభికులు, నేతలు నిలబడ్డారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బండి సంజయ్ ప్రసంగం ముగించిన తర్వాత మోదీ చప్పట్లు కొట్టడం విశేషం.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, గడ్కరీ తదితర నేతలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :