ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగకర్నూల్ జిల్లా అచ్చంపేట మండలలోని శ్రీ ఉమా మహేశ్వర దేవస్థానానికి 25లక్షల రూపాయల భారీ విరాళంను రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, సంఘం నాయకులు కీ.శే. మర్యాద. గోపాలరెడ్డిలు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డికి చెక్కును అందజేశారు. అలాగే శ్రీ ఉమా మహేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం భాగస్వామ్యం వుంటుందని సంఘం అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి తెలిపారు. అనంతరం ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ చైర్మన్ ,సిబ్బంది రెడ్డి సేవా సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం నాయకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి డా. గోవర్దన్ రెడ్డి ,ఆడపాల గోపాల్ రెడ్డి,నరేందర్ రెడ్డి ,కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి ,జైపాల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి, బాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ చంద్రారెడ్డి రెడ్డితో పాటు సంఘం నాయకులు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News