Thursday, 24 September 2026 09:33:30 PM

కుల వృత్తులను కాపాడుతామని చెప్పి నాశ‌నం చేయాల‌ని చూస్తుంద‌ని కాంగ్రెస్ ప్రభుత్వం..

Date : 21 July 2025 08:04 PM Views : 501

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశ‌నం చేయాల‌ని చూస్తుంద‌ని మాజీ మంత్రి వి.శ్రీ‌నివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేద‌న్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో ఆయ‌న మాట్లాడారు. ఆదాయం వచ్చే కుల వృత్తులను ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోంద‌న్నారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల పొలం ఇస్తామని చెప్పారు. గీత కార్మికులు చెట్లపై నుంచి పడి చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కల్లు కంపౌండ్ ద్వారా పది కులాలు బ్రతుకుతున్నాయి. ఉప్పల్‌లో తాటి చెట్లు కొట్టి గీత కార్మికులకు నష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :