Friday, 25 September 2026 05:45:34 PM

ఉద్రిక్తతకు దారి తీసిన బీఆర్‌ఎస్‌ పార్టీ గురుకుల బాట...

Date : 03 December 2024 01:17 PM Views : 1104

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గురుకుల బాట హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది...మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాకేశ్‌ రెడ్డి తో సహా పలువురు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనుమతి లేదంటూ పాఠశాలలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో రాకేశ్‌ రెడ్డి తో సహా కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని మడికొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం నిర్బంధాలను కొనసాగించడం దుర్మార్గమని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :