ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు కరీంనగర్, జగిత్యాల జాతీయ ప్రధాన రహదారిపై ప్లకార్డులతో కొడిమ్యాల మండల రైతులు రాస్తారోకో చేపట్టి బైఠాయించి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ..కొడిమ్యాల మండలానికి ఎల్లంపల్లి నీటిని తీసుకురావడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వలన మండలంలోని పలు గ్రామాల్లో 20 శాతం పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని వెంటనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి వస్తున్నారని రెండు రోజులు 9 గంటల కరెంటు సరఫరా చేశారని అన్నారు. అలాగే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో కేవలం 90 వేల రూపాయలు మాత్రమే ప్రకటించారని నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు అమలు కాలేదని మండిపడ్డారు.
Admin
Aakanksha News