Wednesday, 23 September 2026 11:24:30 AM

నిరాహార దీక్ష. ధర్నాను విజయవంతం చేయండి...

Date : 24 September 2023 02:14 PM Views : 647

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్జీ-2 డివిజన్ కమిటీ సమావేశాన్ని గోదావరిఖని శ్రామిక భవన్ ఆఫీసులో భూమయ్య అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వేల్పుల కుమారస్వామి ఉల్లి మొగిలిలు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ..సింగరేణిలో పని చేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని,గత సంవత్సరం సెప్టెంబర్ 26 సమ్మె సందర్భంగా అగ్రిమెంట్ అయిన అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 27 న అర్జీ-1 జీఎం ముందు జరిగే నిరాహార దీక్ష, ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం జరిగిన ఒప్పందంలోని పెండింగ్ అంశాలను తక్షణమే అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ బోనస్ ను పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల అందరికీ ఉచిత వైద్యంతో పాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు.సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పని ఆధారంగా స్కిల్డ్, సెమిస్కిల్డ్,హైలీ స్కిల్డ్ వేతనాలను ,లారీ డ్రైవర్స్, లు,స్టోర్ వర్కర్స్, బెల్ట్ క్లీనింగ్,షేల్ పీకింగ్ వర్కర్స్ కు చెల్లించాలని పేర్కొన్నారు. పెయిడ్ హాలిడేస్,సిక్ లివ్వులు,అర్జిత సెలవులు, క్యాంటీన్ సదుపాయం తదితర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలను అమలు చేయాలని తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఫ్రీగా యూనిఫామ్ ఇవ్వాలని,IME/PME ఫ్రీ గా చేయాలని పేర్కొన్నారు.నర్సరీ కార్మికులకు కనీస వేతనాలు,పిఎఫ్,బోనస్, హాస్పటల్ సౌకర్యం కల్పించాలని,ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్,బోనస్,హాస్పటల్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ఈనెల 27న ఉదయం RG 1, GM ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష,సాయంత్రం ధర్నాలో కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీనారాయణ ఏ రామయ్య V రవి ,B వేణు D సమ్మాన్న ,జి సంతోష్ జై సురేష్,K శంకర్ రషీద్ పాటు నాయకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :