ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రముఖ సంఘ సేవకురాలు రచయిత్రి పాత్రికేయురాలు శివలెంకనాగ ఉదయలక్ష్మికి గౌరవ డాక్టరేట్ ప్రధానంచేసారు. తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సొసైటీ ఆర్గనైజేషన్ ఆద్వర్యం లో జజ్రిగిన కార్యక్రమం లో ఆమె చేసిన సంఘ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. తీవ్ర దివ్యాంగురాలైన ఉదయలక్ష్మి గత 30 సంవత్సరాలుగా సమాజ సేవకు అంకితమైన ఆమెను పలువురు అభినందించారు. ఈ సందర్బంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ డాక్టర్ ప్రధాన చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారని విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్బగా సంస్థ అద్యక్షులు ఆకుల రమేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ డాక్టరేడు అందుకున్నదులకు తనకి మరింత సామాజిక బాధ్యత పెరిగిందని అన్నారు.దీనితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతానని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు
Admin
Aakanksha News