Saturday, 07 December 2024 01:45:23 PM

8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా

Date : 01 May 2023 04:32 PM Views : 3129

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న ఐటి మినిస్టర్ కేటీఆర్, హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీతో పాటు పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుందని పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరితో కలిసి నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు కమిషనర్ ఛాంబర్, అడిషనల్ డిసిపిల చాంబర్, కాన్ఫరెన్స్ హాల్, గ్రీవెన్స్ సెల్ హాల్, సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్స్, మీటింగ్ హాల్ ,రిసెప్షన్ కౌంటర్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది యొక్క రూమ్స్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా దామోదర్ గుప్తా మాట్లాడుతూ..... 28 ఎకరాల స్థలంలో 38 కోట్ల 50 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మించామని దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పోలీసు యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ బిల్డింగులు సిద్ధమయ్యయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగిందన్నారు. త్వరలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున మిగిలిన చిన్న చిన్న పనులు ఉంటే త్వరత గతిన పూర్తిచేయాలని పోలీస్ అధికారులకు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ శ్రీనివాస్, అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్, మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్., ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్, ఏసీపీ ఏడ్ల మహేష్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని సీఐ లు ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, గోదావరిఖని 2 టౌన్ సీఐ వేణు గోపాల్, రామగుండం సీఐ చంద్ర శేఖర్, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, సిసి మనోజ్ కుమార్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ AE- సాయి చoద్ & వినయ్,DEE- విశ్వనాధం, EE- శ్రీనివాస్,SE- తులసిదర్ , కాంట్రాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :