ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తియిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలనుఅన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగాసమున్నతంగా ముందుకు తీసుకువెళ్లేబాధ్యతను అప్పగించింది.ఆక్షణం నుండిజన సేవకుడిగాప్రజా సంక్షేమ శ్రామికుడిగామదిలో, విధిలో, నిర్ణయాల జడిలోసకల జనహితమే పరమావధిగాజాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగాసహచరుల సహకారంతోజనహితుల ప్రోత్సాహంతోవిమర్శలను సహిస్తూవిద్వేషాలను ఎదురిస్తూస్వేచ్ఛకు రెక్కలు తొడిగిప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచిఅవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకుగొప్ప లక్ష్యాల వైపు నడుస్తూనాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూనిరంతరం జ్వలించేఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగావిరామం ఎరుగక… విశ్రాంతి కోరకముందుకు సాగిపోతున్నానుఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తిసమస్త ప్రజల ఆకాంక్షలుసంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి.
Admin
Aakanksha News