Sunday, 27 September 2026 01:09:57 PM

బర్త్‌డే పార్టీ పేరుతో ఇంటికి పిలిచి అత్యాచార యత్నం...

Date : 31 July 2025 01:40 PM Views : 1041

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఓ యువకుడి ప్రవర్తన కలకలం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువతిని బర్త్‌డే పార్టీ పేరుతో ఇంటికి పిలిచి, ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.బాలానగర్‌కు చెందిన జే. సిద్ధా రెడ్డి (24) అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా మణికొండకు చెందిన 25 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్పిడీ చేసి తరచూ చాటింగ్, కాల్స్ ద్వారా పరస్పరం మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టినరోజు ఉందని ఆమెను ఇంటికి రావాలని సిద్ధా రెడ్డి కోరాడు. ఆమె ఇంటికి రాగా, అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన యువతి అతడి బహిరంగ ప్రవర్తనపై నిరసన వ్యక్తం చేసి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సిద్ధా రెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవాడిగా గుర్తించగా, ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :