ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ రి.నెం బి 2794(టిడబ్ల్యూ జే ఎఫ్ అనుబంధం ) సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి టిడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్ యు జే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హెచ్ యు జే సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, టిడబ్ల్యూ జే ఎఫ్ అనుబంధ సంఘంగా కొనసాగుతున్న హెచ్ యు జే చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టిడబ్ల్యూ జే ఎఫ్, హెచ్ యు జే నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సమస్యలపై నికరంగా పనిచేసే సంఘం హెచ్ యు జే మాత్రమేనని సోమయ్య అన్నారు. హెచ్ యు జే అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక హెచ్ యు జే కు జర్నలిస్టుల మద్దతు సంపూర్ణంగా ఉన్నదని చెప్పారు. టిడబ్ల్యూ జే ఎఫ్ ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, మాట్లాడుతూ హెచ్ యు జే టీం కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల్లో విశ్వాసం నింపేలా హెచ్ యు జే పని చేయాలని టిడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ అకాంక్షించారు.టిడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిరాధిక మాట్లాడుతూ, సంఘంలో మహిళా ప్రాధాన్యం పెరగాల్సి ఉందనీ, ఆదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి సభ్యత్వాన్ని ఫెడరేషన్ అధ్యక్షుడు సోమయ్యకు హెచ్ యు జే అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, బి జగదీష్ లు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ యు జే నాయకులు రాజశేఖర్. నవీన్, పద్మరాజు, నాగవాణి, ప్రశాంత్, విజయ, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News