ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : శీతాకాలం వచ్చిందంటే చాలు చలి... పులిలా ప్రజలను వణికిస్తుంది. ఈ నెల ప్రారంభం నుంచి తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువైంది. శీతాకాలంలో వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకునే మార్పుల వల్ల, మంచు కురవడం వల్ల ఆరోగ్యం పై విపరీతంగా ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది అప్పుడే చలిగాలులు ప్రజలను వనికిస్తున్నాయి. దీనితో ప్రజలకు ఆరోగ్యపరంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
Admin
Aakanksha News