Sunday, 07 December 2025 08:57:27 AM

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్..

Date : 01 March 2025 07:31 PM Views : 563

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని కమిటీ గడువు ఇచ్చింది. అయితే గడువులోపు మల్లన్న నుంచి వివరణ రాకపోవడంతో క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్స్ చేస్తూ.. ఛైర్మన్ జి.చిన్నారావు ఉత్తర్వులు జారీ చేశారు. . వరంగల్‌లో జరిగిన బిసి బహిరంగ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గంలో, కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వచ్చింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :