ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఇటీవల కేసీఆర్ ప్రకటించిన రైతు రుణ మాఫీ గురుంచి రైతుల స్పందన తెలుసుకోవడానికి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మండల గ్రామాల్లోనీ పొలాలలో తిరుగుతూ రైతులతో ముచ్చటించారు. వారి స్పందనను తెలుసుకున్నారు. తెలంగాణ రైతాంగానికి రైతులకి ఎప్పుడు అండగా ఉండే కేసీఅర్ ఇప్పటికే రైతు బందు, రైతు భీమా , ఉచిత కరెంటు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి మా అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు రైతు రుణ మాఫీ తో మాకు దేవుడుగా కేసీఆర్ ఉన్నారని రైతులు ఆనంద బాష్పాలతో తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. కేసీఆర్ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలనీ తెలపాలని అనుకున్న జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి,కుక్కలగూడూర్ గ్రామంలో వినూత్నంగా కార్యక్రమాన్ని ఎర్పాటు చేసారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గోని వారి వారి ఎడ్లబండ్ల పైన థాంక్స్ టు కేసీఆర్ అంటూ ఫ్లకర్డ్స్ తో వారి కృతజ్ఞతలు వినూత్నంగా తెలియజేశారు.
Admin
Aakanksha News