Thursday, 25 June 2026 08:54:24 PM

సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

నగర కార్యదర్శి కామ్రేడ్ కే. కనక రాజ్

Date : 06 October 2022 05:05 PM Views : 476

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సీపీఐ రామగుండం నగర కార్యదర్శి కే.కనకరాజ్ అన్నారు. గురువారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన 24వ జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల కార్యక్రమం రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్ తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో సీపీఐ పార్టీ 1925 సంవత్సరంలో ఆవిర్భావం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించడం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ జాతి సంపద ఐన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పోరేట్ లకు దోచిపెడుతూ ఊడిగం చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలకు, కార్మిక వర్గం కు నష్టం చేస్తున్న బిజేపి ని తరిమి కొట్టడానికి వామపక్ష, ప్రజా తంత్ర శక్తులు ఐక్యంగా ఉండి దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగే విధంగా సిపిఐ చేస్తున్న కృషి లో బాగంగా ఈ నెల 14నుండి18 వరకు విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మహాసభలకు మన దేశంతో పాటు ప్రపంచంలోని 40దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని, ఇట్టి మహాసభలను జయప్రదం చేయడం కోసం సిపిఐ కి ఆర్థికంగా, హార్థికంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన నగర ప్రజలను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సమితి నాయకులు తాల్లపెల్లి మల్లయ్య, మద్దెల దినెష్, టి.రమేష్ కుమార్,మాటేటి శంకర్, బోడకుంట కనకయ్య, ఎర్రల రాజయ్య, మార్కపూరి సూర్య, రేణికుంట్ల ప్రీతం, చిలుముల రాజయ్య, బోళ్ళ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :