Monday, 10 August 2026 04:03:49 PM

శ్రీరామకృష్ణ సేవా మందిర్ లో సౌర విద్యుత్ శక్తి ప్రారంభం...

క్రెడాయి వరంగల్ వారి ఆర్ధిక సౌజన్యానికి అభినందనలు.... ముఖ్య అతిథి నాయిని నీలిమా రెడ్డి

Date : 28 January 2025 06:56 AM Views : 424

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : ;శ్రీ రామకృష్ణ సేవా సమితి హనుమకొండ ప్రాంగణంలో క్రెడాయ్ వరంగల్ వారి ఆర్థిక సౌజన్యంతో ఏర్పరిచిన 10 కిలో వాట్స్ సోలార్ ప్లాంట్ ను హన్మకొండ స్తానిక శాసన సబ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమ ప్రారంభించారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి లాంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థకు సోలార్ ప్లాంట్ ను అందించడం పట్ల నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి క్రెడాయ్ సంస్థను అభినందించారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి వారు మరిన్ని ధార్మిక కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యంగా కాజీపేట హనుమకొండ వరంగల్ పట్టణాలలో ఉన్న విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వాన్ని నైతిక విలువలను అందించాలని కోరారు, దీనికిగాను తన వంతు సహాయ సహకారాలను ఈ సేవా సమితికి అందిస్తామని తెలిపారు. క్రెడాయ్ వరంగల్ అధ్యక్షులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవాసమితి లాంటి ధార్మిక సంస్థకు ఆర్థిక సహకారం అందించడం తమకు ఎంతో సంతోషదాయకమని తెలియజేశారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి లాంటి సామాజిక ఆధ్యాత్మిక సంస్థకు సహకరించడం మా క్రెడాయ్ వరంగల్ అదృష్టం అని అన్నారు.శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరంలో 10 కిలో వాట్స్ సోలార్ ప్లాంటును అందజేసినందుకు క్రెడాయ్ వరంగల్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇంకా ఈ సమావేశంలో క్రెడాయ్ వరంగల్ ప్రధాన కార్యదర్శి మనోహర్, మాజీ అధ్యక్షులు చందుపట్ల సత్యనారాయణ రెడ్డి, ప్రతినిధులు లెక్కల రజనీకాంత్ రెడ్డి, ఏ. నాగరాజు, ఎ, వెంకట మల్లా రెడ్డి, గాదె రాజేందర్ రెడ్డి, వరంగల్ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి చాడ సురేష్ రెడ్డి, కొండా నాగరాజు, కె.శ్రీనివాస్ రెడ్డి, అడ్వకేట్ కొండం వెంకట్ రెడ్డి, సేవా సమితి ప్రతినిధులు జినుగు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస స్వామి, కెవి రావు, మూల తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు జి. మధుసూదన్ రెడ్డి, ఎన్.వెంకట్రాం నర్సయ్య, చెంచారపు మధుసూదన్ రెడ్డి, సభ్యులు కేశవ రెడ్డి, కె.ప్రభాకర్ రాజు, కె.సూర్య, ఎం.నవీన్ రెడ్డి, అశోక్ రెడ్డి, సరోజనమ్మ, గోరంటల స్వరూప, చిదర అంజనీ దేవి, లక్ష్మి రావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :