ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం పర్యటనను అడ్డుకుంటారనే సమాచారం మేరకు ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. అయితే భూనిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనకు తరలించారు. సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అక్కడే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ప్రగతిభవన్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Admin
Aakanksha News