Friday, 25 September 2026 04:58:18 PM

ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ల చెల్లింపు...

Date : 21 September 2024 08:08 PM Views : 443

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల బోనస్ ను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రామగుండం నగర కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు అబ్దుల్ కరీం,శనిగరపు చంద్ర శేఖర్ లు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సింగరేణి సంస్థలో దాదాపు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారని సింగరేణి సంస్థ వార్షిక లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల ప్రత్యక్ష పాత్ర ఉందని,కాంట్రాక్ట్ కార్మికులకు వారికి లాభాల వాట చెల్లించాలని AITUC అనేక పోరాటాలు నిర్వహిస్తే ఆనాటి యాజమన్యం అధికారులు, ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో కార్మికుల శ్రమను దోచుకొన్నారన్నారు.నాటి నుండి నేటి వరకు కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించలేదని,అయినా కార్మికుల పక్షాన ఉండి AITUC పోరాటాలు నిర్వహించి, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, ఏఐటీయూసీ గెలిచిన వెంటనే కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల్లో వాటా చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC అభ్యర్థన మేరకు కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాగా 5వేల రూపాయలు చెల్లించుటకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :