ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగాడుతూనే ఉంటామని ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కవిత చేశారు...ఈ సందర్భంగా శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు... అప్పులపై కాంగ్రెస్ పార్టీ నేతల తప్పులు బయట పడుతున్నాయని రాష్ట్ర మొత్తం అప్పులు 4 లక్షల 42 అని పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 8 కోట్ల అప్పులు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం బ్యారేజీలు కూలిపోతున్నాయని అనడంతో ఎటువంటి వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి మండలిలో చెప్పారని గుర్తు చేశారు. నీళ్లు ఇవ్వకపోవడం అది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాద అని ప్రశ్నించారు. ఏప్రిల్ 27వ తేదీన ఎలుక పూర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం మహా కుంభమేళ తరహాలో ఈ సభ జరుగుతుందన్నారు. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాసనమండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని సమన్వయంతో అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా చేశమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రతిరోజు విన్నుతన రీతిలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రజలు రైతులు మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై శాసనమండలిలో గాళమెత్తమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలపై కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పై బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలకు ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని శాసనమండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ శాసనమండలి సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం పొందాయని ఈ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్దేశించి పరుష పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడారని ఈ వ్యాఖ్యలు చరిత్రలో ఒక మరకగా ఉండిపోతాయని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Admin
Aakanksha News