Saturday, 26 September 2026 12:02:27 AM

మీ అహంకారమే మీ ఓటమికి కారణం....

మాపై మాట్లాడే ముందు కేటీఆర్ కు బుద్ధి ఉండాలి..కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్

Date : 25 January 2024 02:32 PM Views : 624

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : మీ అహంకారమే.. మీ ఓటమికి కారణమైందని... మాపై మాట్లాడే ముందు కేటీఆర్ కు బుద్ధి ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే కేటీఆర్ కు మెదడు పని చేయక విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారన్నారు. తొమ్మిదేళ్లు గడిల పరిపాలనను కొనసాగించారని విమర్శించారు. ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఎందుకు నీచపు కుళ్ళు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలు మావైపే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సర్పంచులకు వేల బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరు గత ప్రభుత్వం కాద అని ప్రశ్నించారు. మేము సక్రమంగా పనిచేస్తేనే ప్రజలు మళ్లీ మాకు అవకాశం ఇస్తారని లేకపోతే అవకాశం ఇవ్వరని అది ప్రజల నిర్ణయం అని తెలిపారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేస్తే ప్రజలు గుర్తిస్తారని లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు. రాజన్న మా ఇలా వేల్పు..కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటాం, అది వాసి కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు.బీఅర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురి అయిందని మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :