Thursday, 24 September 2026 03:35:07 PM

నేతాజీ ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపడుదాం...

మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్..

Date : 23 January 2024 04:34 PM Views : 852

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : నేతాజీ ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను చేపట్టాలని మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని కాలేజీ రోడ్డులోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో యువతను ముందుండి నడిపించిన ఘనత ఆయన సొంతమన్నారు. ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించిన యోధుడని ఆయన స్పూర్తితో దేశం కోసం పాటుపడల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతాజీ చేసిన ఉద్యమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొంకళ్ళ చెన్నయ్య,అగ్గనూర్ బస్వం,వన్నాడ వెంకటేష్ గౌడ్,అగ్గనూర్ నందు,గాజుల శేఖర్, పిట్టల నరేందర్, రాజేష్, భాస్కర్ చారి, జీవి. శ్రీధర్ రాజు, ఖాజా, శివ, ప్రవీణ్, వినోదు తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :