Thursday, 24 September 2026 04:09:07 PM

రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న – మంత్రి కొప్పుల దంపతులు

Date : 21 November 2022 03:34 PM Views : 519

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, ఈ.ఓ కృష్ణ ప్రసాద్ తోపాటు పలువురు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :