ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని పదోన్నతులు పొందలని రామగుండం-3 ఏరియా ఎస్వోటు జీయం గుంజపడుగు రఘుపతి అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని ఓసిపి-1 ప్రాజెక్టు ఆఫీస్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన కౌన్సెలింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై..ప్రమోషన్స్ విధానం, ఆర్థిక లబ్ధి వివిధ అంశాలను మహిళా ఉద్యోగులకు వివరించారు.కౌన్సిలింగ్ కు మొత్తం 22 మంది మహిళ బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్ ఉద్యోగులు హాజరు కాగా కమిటీ సభ్యులు 16 డిజిగినేషన్స్ లలో గల పని విధానం గురించి తెలిపారు. ఉద్యోగులకు ఎంచుకున్నపదిన్నతి పై తగిన శిక్షణ అందించి, సంబంధిత ఉద్యోగాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు.మహిళ ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిగినేషన్స్ లోకి మారడం వలన పదోన్నతులు, ఆర్థికలబ్ధి పొందవచ్చునని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి జె.రాజశేఖర్, ఐఈడి డిజియం కె.చంద్రశేఖర్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటి పర్సనల్ మేనేజర్ వి.సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News