Monday, 21 September 2026 04:30:04 AM

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా సిఎం రేవంత్ రెడ్డి..

Date : 30 October 2024 09:19 PM Views : 387

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌లను నియమించారు. ఈ మేరకు బుధవారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎంపి కుమారి సెల్జా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో ఎన్నికల సంఘానికి లేఖలో పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా సిఎం రేవంత్ రెడ్డి పేరు జాబితాలో ఉంది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు సిఎం రేవంత్, కర్ణాటక సిఎం సిద్ధరామయ్యలు ఉన్నారు. ఇక మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనుండగా జార్ఖండ్‌కు మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :