Sunday, 27 September 2026 08:20:51 AM

భర్తతో ఉన్న విబేధాలను పరిష్కరించాలంటే.. తన కోరిక తీర్చమన్న ఎస్ఐ

Date : 24 November 2024 06:29 PM Views : 1406

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్తే ఓ ఎస్సై దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్తతో ఉన్న విబేధాలను పరిష్కరించాలంటే.. తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఎవరూ లేనప్పుడు చెబితే ఇంటికి వస్తానంటూ నిత్యం వాట్సాప్‌లో కాల్‌ చేసి ఆమెకు వేధింపులకు గురిచేశాడు. హైదరాబాద్‌లోని హయత్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ.. తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే సదరు మహిళపై కన్నేసిన ఎస్సై సైదులు ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. అప్పట్నుంచి ఆమెను కాల్‌ చేసి వేధించడం మొదలుపెట్టారు. నీ భర్తతో ఉన్న సమస్యను పరిష్కరిస్తా.. నా కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెప్ప వస్తానంటూ వాట్సాప్‌ కాల్‌ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు మహిళను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించుకుని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :