ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : ప్రముఖ సింగర్ మధుప్రియ కొత్త వివాదంలో చిక్కుకున్నారు.ఆమెపై హిందువులు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సింగర్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. అది కూడా భక్తులు దర్శనానికి రాకుండా గుడి తలుపులు మూసేసి గర్భగుడిలో సాంగ్ షూటింగ్ జరపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మధుప్రియ తీరుపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడిలో సాంగ్ షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News