ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని మోడీ రామగుండంలో చేసిన ప్రకటనపై బి.ఎం.ఎస్ నాయకులు ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం సిగ్గు చేటని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.దేశ వ్యాప్తంగా అన్వేషణ విభాగం గుర్తించిన బొగ్గు బ్లాకులను కోల్ ఇండియా కు,సింగరేణి కి ఇవ్వాల్సి ఉండగా 2015 లో మైనింగ్ చట్టాన్ని కమర్షియల్ చట్టంగా మార్చి అనేక బొగ్గుగనులను ప్రైవేటు వారికి ఇచ్చారని,భవిష్యత్ లో ఇవ్వనున్నారని ఆయన ఆరోపించారు.ఇప్పటికే సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటు వారికి ఇచ్చారని దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.సింగరేణిలో ప్రైవేటీకరణ లేదని ప్రధాని చేసిన ప్రకటన అంతా బూటకమని ఆయన అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ప్రక్కదారి పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.దమ్ముంటే ప్రైవేటు వారికి ఇచ్చిన సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ రద్దు చేసి సింగరేణికి కెటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News