Friday, 25 September 2026 04:57:24 PM

నవంబర్ చివరి వారంలో సింగరేణి ఎన్నికలు....?

ఉప ఎన్నికలకు సవాల్ గా మారిన సింగరేణి ఎన్నికలు

Date : 28 October 2022 04:35 PM Views : 896

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు నిర్వహించమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కసరత్తులను ప్రారంభిస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.. సింగరేణి ఎన్నికల గడువు ముగిసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుండడంపై ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య కోర్టును ఆశ్రయించారు. అయితే 05-అక్టోబర్-2017 లో సింగరేణి ఎన్నికల జరగగా ఆ సమయంలో రెండు సంవత్సరాల కాలం పరిమితితో 05-అక్టోబర్-2019 ఎన్నికల కాలపరిమితి ముగియగా బొగ్గు గని కార్మిక సంఘం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మరో రెండు సంవత్సరాలకాల పరిమితి పెరగడంతో అధికారికంగా సింగరేణి బొగ్గు గాని కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ సాగింది. అయితే ఎన్నికల పరిమితి ముగిసి మూడు సంవత్సరాలు దాటుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి సింగరేణి ఎన్నికలు తెర మీదికి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉప ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారుతుండగా సింగరేణి ఎన్నికల ప్రకటన రావడం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు సవాల్గా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా నవంబర్ చివరి వారంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :