Sunday, 26 July 2026 05:32:26 AM

నేడు బీజేపీలో చేరనున్న కందుల సంధ్యారాణి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక

Date : 18 October 2023 08:47 AM Views : 1737

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి అసంతృప్తిగా ఉన్న పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి గతంలోనే పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, సన్నిహితులు అభిమానులతో సమావేశమైన అనంతరం మరి సలహాలు సూచనల మేరకు బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో సంధ్యారాణి బీజేపీ కండువా కప్పుకొనున్నారు. ఇప్పటికే సంధ్యారాణి దంపతులు హైదరాబాదుకు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :