Sunday, 27 September 2026 01:35:47 AM

దివ్యాంగులకు రాజ్యాధికారం వాటా దక్కాల్సిందే..

ఆదిలీల ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ వాణి చందేల్

Date : 01 January 2025 06:45 PM Views : 447

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాజ్యాధికారానికి దివ్యాంగులు అర్హులేనని రాజ్యాధికారంలో దివ్యాంగులు పాలుపంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్త ఆదిలీల ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి శ్రీ వాణి చందేల్ అన్నారు. వరల్డ్ డిసబుల్ డే పురస్కరించుకొని దివ్యాంగులకు రాజ్యాధికారం అనే నినాదాంతో ఐపిసి దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో అబిడ్స్ లోని సూర్యలోక్ కాంప్లెక్స్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా పాల్గొని ప్రసంగించారు. దివ్యాంగులు అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వారుకూడా దీవుడు సృష్టించిన బిడ్డలేనని సమాజంలో మనతో కలిసి మెలిసి ఉంటున్న వారికి గౌరవం ఇవ్వవలసిన తోటివారిగ బాద్యత అన్నారు. వారికి అండ వైకల్యం ఉండవచ్చు గాని తెలివితేటల్లో అందరికన్నా ఒకడుగు ముందే ఉంటారన్నారు. దివ్యాంగులు దివ్యాంగులమని బాధపడకుండా ఆత్మస్త్యర్యంతో అందరితో సమానంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాంటప్పుడే దివ్యాంగులు అభివృద్ధి పాఠం లో ముందుకు వేల్లగాలరన్నారు. ఈ సందర్బంగా ఐపిసి దివ్యాంగుల విభాగం జాతీయ అధ్యక్షురాలు శివలెంక ఉదయలక్ష్మి, జాతీయ అద్యక్షులు శ్రీదర్, చిత్ర , అల్లాజీ,నవీన తదితరులు శ్రీ వాణి చందేల్ ను ఘనంగా సన్మానించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :