ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కంపెనీకి లక్షల రూపాయల నష్టం చేస్తున్నారని అర్జీ-1 సీఎస్ పీ తోటి కార్మికుల పేరుతో పోస్టర్లు నోటిస్ బోర్డులో అంటించడంతో సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. కొందరు గుర్తింపు సంఘం నాయకులు ఓ సింగరేణి అధికారితో కుమ్మక్కై అక్రమలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే డిప్యూటేషన్, బదిలీల పేరుతో నెలసరి వసూలు చేస్తూన్నారని ఎవరైనా చెప్పిన మాట వినకపోతే డిప్యూటేషన్ లెటర్ ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. అదేవిధంగా సీఎస్ పీ లో ప్రైవేట్ లోడర్లతో కుమ్మక్కై పనిచేయకుండా స్టార్ట్ చేసి తప్పుగా రీడింగ్ నమోదు చేస్తున్నారన్నారు. ఓ సంఘానికి చెందిన నాయకుడు రోజు మాస్టర్ పడి దర్చాగా బయట తిరుగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం వెలిసిన రెండు పేజీల లేక సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.
Admin
Aakanksha News