ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారని, నన్ను ఎవరు నమ్ముత లేరు, అప్పు పుడతలేదు, అందరు దొంగను చూసినట్లు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఒప్పుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... 420 హామీలతో అభయహస్తం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం అని ఆరోపించారు. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60యెడ్లు గోస పడతామని, మళ్లీ అ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఢిల్లీ పార్టీలను నమ్మితే మోసం చేస్తారని ఆనాడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రతీ మాట నిజమైందని అన్నారు. ఇంత దివాలా కోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు మాట్లాడ లేదని నాకు పరిపాలన చేతకాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులేత్తసారని అన్నారు. దొంగ చేతికి కాంగ్రెస్ పార్టీ తాళాలు ఇచ్చిందని విమర్శించారు. సరిగ్గా మూడేళ్ల క్రితం రాహుల్ గాంధీ వరంగల్ కు వచ్చిన సమయంలో రైతు డిక్లరేషన్ పేరుతో 2లక్షల రుణమాఫీ రైతు బందు 15వేల రూపాయల పెంపు, కౌలు రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేస్తామని చెప్పి మూడేళ్లు దాటిందని అన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. దొంగ చేతికి తాళం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేతికి చిప్ప చేతికి వచ్చే పరిస్థితిని తీసుకవచ్చారని దీనికి రాహుల్ గాంధీనే బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని తిట్లు తిట్టిన దుషించిన భరించామని మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు మాటలు మాట్లాడిన కూడా ఓపిక పట్టమని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్టాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది త్యాగాలతో దాశాబ్దాల పోరాటం ఫలితంగా టీఎన్జీవోలు ఎంతోమంది నాయకులు పోరాటాలు నిర్వహించారని అన్నారు.
Admin
Aakanksha News