Tuesday, 11 August 2026 03:43:23 PM

హామీలు ఇచ్చి మర్చిపోవడం కేసీఆర్ కేటీఆర్ కు అలవాటే..

Date : 20 October 2022 09:05 PM Views : 415

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూ ఢిల్లీ : బ్రతికి ఉన్నవారికి సమాధి కట్టే సాంప్రదాయం టిఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇస్తారని ఆ తర్వాత మర్చిపోతారని ఆయన విమర్శించారు. మునుగోడు ఎన్నికలలో అధికార పార్టీ పూర్తిగా దిగజారి పోయిందని విమర్శించారు. జేపీ నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా ఆయన సమాధి కట్టే నీచ నికృష్ట చర్యలకు దిగిందంటూ మండిపడ్డారు. మా సహనాన్ని అసమర్ధగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :