Sunday, 27 September 2026 08:20:43 AM

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్...

Date : 14 December 2023 01:35 PM Views : 628

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్ బి నగర్ SOT పోలీసులు అరెస్ట్ చేసి కోటి రూపాయల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.వీరి వద్ద నుండి 360 కేజీల గంజాయి నాలుగు మొబైల్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు మాట్లాడుతూ...డ్రగ్స్, గంజాయి పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సరఫరా చేసిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :