ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్ సబ్ స్టేషన్ వద్ద రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సబ్ స్టేషన్ వద్ద ఉరి తీసి అనంతరం దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతు సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వద్దని మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని మాట్లాడడం రైతులను కించపరిచే విధంగా ఉందని అన్నారు. వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు గంటలు కాదు.. రైతులకు మూడు పంటలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే రైతులకు క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో తిరగనివ్వమని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మరోసారి కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.
Admin
Aakanksha News